ఫేవరేట్ మ్యాచ్‌లో ఫీవర్ ఎవరికి?

by  |
ఫేవరేట్ మ్యాచ్‌లో ఫీవర్ ఎవరికి?
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 25వ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభంకానుంది. చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇరు జట్ల బలా బలాలు:

గత ఐపీఎల్‌లో రన్నరప్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌ ఈ సీజన్ ప్రదర్శన అభిమానులను ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడిన చెన్నై 4 మ్యాచుల్లో పరాజయం చెందింది. కేవలం రెండింట్లో మాత్రమే గెలిచింది. తొలి మ్యాచ్‌లో అంబటి చెలరేగగా విజయం లాంఛనమైంది. ఇటీవల పంజాబ్‌ మ్యాచ్‌లో ఒక్క వికెట్ కోల్పోకుండా ఓపెనర్లు రాణించగా చెన్నై గెలుపొందింది. మిగతా మ్యాచ్‌లో ఏ ఆటగాడు గెలుపునకు దోహదపడలేదని నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగ కేదర్ జాదవ్‌ను జట్టు నుంచి తీసేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో సంతకాలు సేకరించారు.

వాస్తవంగా చెన్నై బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తున్న వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడిని దాటాకా ఏ ఆటగాడు క్రీజులో నిలబడలేకపోతున్నారు. ధోని, జడేజా,కేదర్ జాదవ్ ఘోరంగా విఫలమవుతున్నారు. బెస్ట్ ఫినిషర్‌గా పేరున్న ధోని సైతం తన అంచనాలను ఈ సీజన్‌లో ఇంకా రీచ్ కాలేదు. ఇక చెన్నై బౌలింగ్ లైనప్ మంచిగానే కనబడుతోంది. ముఖ్యంగా చెన్నై బ్యాట్స్‌మెన్ల మీదనే మ్యాచ్ గెలుపు-ఓటమి ఆధారపడి ఉంటుంది.

ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్ కొట్టని రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు ఒక మ్యాచ్‌ కాకున్నా.. మరో మ్యాచ్‌లో ప్రతిభకనబరుస్తున్నారు. ఐపీఎల్ 13 సీజన్‌ కప్ కోసం శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 5 మ్యాచులు ఆడిన బెంగళూరు 3 మ్యాచుల్లో విజయం సాధించారు. 2 మ్యాచుల్లో పరాభవం పొందారు.

ఇక బెంగళూరు బ్యాటింగ్ లైనప్ చాలా బలంగానే ఉంది. ఓపెనర్ దేవదత్ పడిక్కల్-ఆరోన్ ఫించ్ ఫామ్ సాగిస్తున్నారు. ఇక విరాట్-ఏబీ డివిలియర్స్ కూడా రాణించినా.. ఇంకా వారి స్థాయికి తగ్గట్టు ఆడాల్సి ఉంది. బౌలింగ్‌లో స్పిన్నర్ చాహల్ మాయ చేస్తున్నాడు. అయితే, ఇండియాకు సారథ్యం వహించిన ఇద్దరు కెప్టెన్ల టీములు మధ్య ఈ రోజు మ్యాచ్ అభిమానుల్లో మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇంతటి ఫేవరేట్ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే.

Next Story

Most Viewed