కోహ్లీని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్

by Anukaran |   ( Updated:2021-12-20 00:46:29.0  )
కోహ్లీని టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. మాజీ క్రికెటర్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్ : వన్డే కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ, కోహ్లీ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఈ విషయంలో బీసీసీఐ చీఫ్ ఇప్పటికే మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉండగా పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ టీమిండియా టెస్టు కెప్టెన్సీ విషయంలో సంచలన కామెంట్స్ చేశాడు. సల్మాన్‌ తన యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడుతూ.. టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించడం మంచిదికాదని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. బీసీసీఐ ఒకవేళ టెస్టు కెప్టెన్సీని కూడా రోహిత్‌కే ఇవ్వాలని భావిస్తే అది సరైన నిర్ణయం కాదని అన్నాడు.

టెస్టు సారథిగా కోహ్లీని తప్పించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇది జరుగుతుందో లేదో నాకూ తెలియదు. అయితే, అలా జరిగితే.. రోహిత్‌, కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయని అర్థమవుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అలా చేస్తే వారిద్దరూ ఇకపై ఆన్‌ఫీల్డ్‌, ఆఫ్‌ది ఫీల్డ్‌లో కలిసి ఉండరని జోస్యం చెప్పాడు. అంతేకాకుండా భారత్‌ తరఫున విదేశాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కోహ్లీని టెస్టు కెప్టెన్‌గా కొనసాగించాలని కోరాడు. ఈ నేపథ్యంలోనే కెప్టెన్‌‌గా విరాట్‌ కోహ్లీ కూడా బ్యాటర్‌గా, సారథిగా రాణించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.

రిషబ్ పంత్‌కు అరుదైన గౌరవం.. సీఎం కీలక ప్రకటన

Next Story

Most Viewed