వీకెండ్ విహార యాత్రలో విషాదం.. ఏడుగురు స్పాట్ డెడ్ (వీడియో)

233

దిశ, వెబ్‌డెస్క్ : విహార యాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. సరస్సులో ప్రకృతిని ఆస్వాదిద్దామని వెళ్లిన పర్యాటకులకు చేదు అనుభవం ఎదురైంది. సరస్సులో యాత్రికుల బోటుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు యాత్రికులు మరణించారు.

వివరాల ప్రకారం.. వీకెండ్ కావడంతో ప్రకృతి అందాలను వీక్షించేందుకు బ్రెజిల్‌లోని ఫర్నస్‌ సరస్సులోకి పర్యాటకులు భారీగా తరలివెళ్లారు. ఈ క్రమంలో మూడు బోట్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. 32 మంది తీవ్రంగా గాయపడగా.. 20 మంది గల్లంతయ్యారు. గల్లంతు అయిన వారికోసం అధికారులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సొనారో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలానికి సహాయక దళాలను రంగంలోకి దింపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు తెలిపారు.