వాహనాలకు రోడ్‌ టాక్స్ రద్దు..

89

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోతున్న దృష్ట్యా ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాటరీలతో నడిచే వాహనాలకు రోడ్ ట్యాక్స్‌ను రద్దు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ వాహనాల వినియోగాలన్ని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్న కేజ్రీ సర్కార్.. 2024 కల్లా మొత్తం వాహనాల్లో 25శాతం విద్యుత్ వాహనాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదివరకే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఆటోల కొనుగోలుకు రూ.30వేలు, కార్లకు సంబంధించి రూ.1.5లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఢిల్లీ సర్కార్ స్పష్టంచేసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..