దశాబ్దాల కల ఈ సంక్రాంతికి నెరవేరింది: ఎమ్మెల్యే పెద్ది

85
Peddhi-Sudharshan-Reddy-11

దిశ, ఖానాపూర్: పాఖాల- ఖానాపూర్ మధ్య నూతనంగా నిర్మించిన బీటీ రహదారితో దశాబ్దాల కల నెరవేరింది. సుమారు రూ. 5 కోట్ల 60 లక్షల వ్యయంతో నిర్మించిన రహదారిని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంక్రాంతి రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు, పాకాల పర్యాటకులకు, ఖానాపూర్ రైతులకు సంక్రాంతి కానుకగా ఈ రహదారిని అందిస్తున్నట్లు పెద్ది తెలిపారు. ఖానాపూర్ మండలాన్ని రెండు భాగాలుగా ఉన్న జనావాసాలను, గ్రామాలను ఒకటిగా చేస్తూ పాకాల నుంచి ఖానాపురం మండల కేంద్రానికి రోడ్డును, రెండు బ్రిడ్జిలను ఏకకాలంలో మంజూరు చేసుకొని సకాలంలో పూర్తి చేసుకున్నామన్నారు. శనివారం సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా రైతులకు, పర్యాటకులకు, ఖానాపూర్ మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పాకాల ఆయకట్టు కింద ఉన్న వేలాదిమంది రైతులు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగవచ్చన్నారు. పాకాల పర్యాటక రంగం కొత్తగూడ మండలానికి, ఇల్లందు, మహబూబాబాద్ జిల్లాకు కూడా ప్రత్యామ్నాయ రోడ్డుగా ఇది మారనుందన్నారు. రహదారిని సకాలంలో పూర్తి చేయడానికి సహకరించిన కాంట్రాక్టర్లకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఎమ్మెల్యే పెద్ది ధన్యవాదాలు తెలిపారు. సంక్రాంతి పర్వదినం తర్వాత మిగిలిపోయిన పాకాల ఆయకట్టు పనులను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ రామస్వామి, ఎంపీపీ ప్రకాష్ రావు, జెడ్పీటీసీ, కన్వీనర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పార్టీ ముఖ్య నాయకులు, క్లస్టర్ బాధ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.