ఆర్కే మరణవార్తతో నల్లమల మూగబోయిందా..!

by  |
ఆర్కే మరణవార్తతో నల్లమల మూగబోయిందా..!
X

దిశ, అచ్చంపేట : నల్లమల అడవులు, ప్రాంతానికి.. ఆర్కేతో విడదీయరాని అనుబంధం ఉందని చెప్పవచ్చు. సుమారు మూడు దశాబ్దాల పాటు నల్లమలలో మావోయిస్టు కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగాయి. ఈ సమయంలో ఆదిమ జాతి గిరిజనులతో ఆర్కే ప్రస్థానం కొనసాగిందని చెబుతారు. వీరి ప్రాబల్యంతో నల్లమల పేరు వినగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడా భూస్వాములు, రాజకీయ నాయకులు, అగ్రవర్ణాల వెన్నులో వణుకు పుట్టేదని ప్రచారం ఉండేది. ఆ తర్వాత స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2004లో.. మావోయిస్టులతో శాంతియుత చర్చలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆ చర్చల సందర్భంగా మావోయిస్టు ఆర్కే‌తో పాటు అగ్రనేతలు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అడవి, శ్రీశైలం దోర్నాల హైవే మీదుగా చినారుట్ల ప్రాంతం గుండా బయటకొచ్చారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో నల్లమలలో మావోయిస్టుల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయింది. కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న ఆర్కే అనారోగ్యంతో మృతి చెందడాని వార్తలు రావడంతో.. ఆయనకు నల్లమల్ల ప్రాంతానికి బంధం ముగిసిందని చెప్పవచ్చు. ఈ వార్తతో నల్లమల మూగబోయింది అంటూ కథనాలు వస్తున్నాయి.


Next Story