ఇంకా ‘వేధిస్తూనే’ ఉన్నాయి… పోస్టు కొవిడ్ క్లినిక్ లకు పెరుగుతున్న పేషెంట్లు

by  |
Corona
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొవిడ్​ నుంచి రికవరీ అయ్యామనే సంతోషాన్ని మరువక ముందే బాధితుల్లో వివిధ రకాల హెల్త్ కాంప్లికేషన్లు షురూ అవుతున్నాయి. కొందరికి నెల రోజులలోపే సమస్యలు వస్తుండగా.. మరి కొందరిలో ఆరు నెలల తర్వాత కూడా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తేలుతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. దీంతో గత నెల రోజుల నుంచి పోస్ట్​ కొవిడ్​ సమస్యలతో వందల సంఖ్యలో ఆసుపత్రులు బాట పడుతున్నారు. హైదరాబాద్​ లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్​, కింగ్​కోఠితో పాటు ఏరియా, జిల్లా ఆసుపత్రులకూ పోస్ట్​ కొవిడ్ పేషెంట్లు పెరుగుతున్నారు.

హాస్పిటల్స్​ వచ్చే ప్రతీ 100 మందిలో 80 మందికి కండరాల బలహీనతతో అలసత్వం, నీరసం, వంటి సమస్యలు వస్తుండగా, 20 శాతం మందిలో జ్ఞాపక శక్తి నశించడం, డయేరియా, ఒళ్లు నొప్పులు వంటివి వేధిస్తున్నట్లు గాంధీ, ఉస్మానియా వైద్యులు పరిశీలనలో తేలింది. ప్రస్తుతం ప్రతీ రోజు ఇలాంటి సమస్యలతో గాంధీకి సుమారు 100 నుంచి 120 మంది బాధితులు వస్తుండగా.. ఉస్మానియాకు సుమారు 150 మంది పోస్ట్​ కొవిడ్​ సమస్యలతో వస్తున్నట్టు అక్కడి డాక్టర్లు తెలిపారు. అంతేగాక ఇటీవల కాలంలో జుట్టు ఊడిపోతుందని ఆసుపత్రుల బాట పడుతున్న వారి సంఖ్య భారీగానే ఉన్నది.

మితీమిరిన పనులతోనే…

కొవిడ్​ నుంచి కోలుకున్న తర్వాత మానసిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు యోగ, వ్యాయామం వంటివి చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కానీ చాలా మంది వ్యాయామం, యోగాలను అతిగా చేయడం వలన కూడా కండరాల బలహీనతతో అలసిపోతున్నారు. ఇది చాలా ప్రమాదమని వైద్యులు వివరిస్తున్నారు. అంతేగాక కొందరు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రతీ రోజు ఒకే సారి ఐదారు గుడ్లు తింటున్నారని, ఇదీ మంచిది కాదని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఇలాంటి వారిలోనే డయేరియా, కడుపునొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు వివరిస్తున్నారు.మరి కొందరిలో ఎండోథెలియల్​ కణాలు దెబ్బతిని శ్వాస సమస్యలు, ఆయాసం వంటి ప్రాబ్లామ్స్​ కూడా వస్తున్నాయి.

అత్యధిక స్టెరాయిడ్స్​ ప్రమాదమే…

కరోనా సెకండ్​ వేవ్​ లో స్టెరాయిడ్ల వినియోగం భారీగా పెరిగింది. కరోనా తీవ్రతను తగ్గించేందుకు రెమ్​ డెసివీర్​ వంటి యాంటీవైరల్​ డ్రగ్​ తో పాటు డెక్సామెథాసోన్​,టొసిలోజూమబ్​ తదితర స్టెరాయిడ్లను విరివిగా వినియోగించారు. అయితే చాలా మందిలో వైరస్ ​తీవ్రతను వేగంగా కంట్రోల్​ చేసేందుకు ఆక్సిజన్​ లెవల్స్​ 95 ఉన్నా, ఈ మందులను ఇచ్చారు. ఇవి హెవీ డోసులతో కూడినవి కావడంతో తాత్కాలికంగా రోగం తగ్గినా, ఆ డ్రగ్​ ప్రభావం ఇతర అవయవాలపై పడుతున్నది. దీంతో నే పోస్ట్​ కొవిడ్​ సమస్యలు వస్తున్నాయి. ఆరు నెలల వరకు విశ్రాంతి అవసరం: డా కిరణ్​ మాదాల క్రిటికల్​ హెచ్​ఓడీ నిజామాబాద్​
కొవిడ్​ నుంచి కొలుకున్న తర్వాత కూడా ఆరు నెలల వరకు బాధితులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇమ్యూనిటీ పెంచుకునేందుకు సిట్రస్​ జాతికి చెందిన పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అంతేగాక స్వల్ప పాటి వ్యాయామాలు మాత్రమే చేయాలి. అంతేగాక ఆరు నెలల పాటు ఎప్పటికప్పుడు వైద్యుడి సలహాలు , సూచనలు తీసుకోవాలి.

మెట్లు ఎక్కడంతో మరింత సమస్య…

కొవిడ్​ వైరస్​ నేరుగా లంగ్స్​ పై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, బాధితులు కొలుకున్న తర్వాత మెట్లు ఎక్కడం, బరువులు మోయకపోవడం వంటివి చేయకపోవడం మంచిది. చాలా మంది అవగాహన లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతోనే పోస్ట్​ కొవిడ్​ లో అలసత్వం వంటి సమస్య ఎక్కువైనది.


Next Story

Most Viewed