'మా'లో కుల రాజకీయం.. కమ్మ వర్సెస్ కాపు.. మధ్యలో ఆర్జీవీ చిచ్చు

by  |
RGV
X

దిశ, తెలంగాణ బ్యూరో: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో లోకల్ నాన్ లోకల్ వార్ మొదలైంది. కమ్మ కాపుల మధ్య ఈ వార్ కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ, జీవిత రాజశేఖర్ పోటీ పడుతున్నారు. ఇందులో ప్రధానంగా మంచు విష్ణు ప్యానల్, ప్రకాష్ రాజ్ ప్యానల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కమ్మ వర్సెస్ కాపు అన్నట్లుగా ఈ ఎన్నికలు జరగనున్నాయి. మంచు మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కమ్మ వర్గానికి చెందిన వారు కావడంతో మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నారు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు తదితరులు మద్దతు తెలుపుతున్నారు.

అయితే మంచు విష్ణు వర్గం ప్రకాష్ రాజ్ లోకల్‌కు చెందిన వాడు కాదని, ఆయనకు ఇక్కడి ఆర్టిస్టుల పరిస్థితులు, వారు పడుతున్న ఇబ్బందులు ఎలా తెలుస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సీన్‌లోకి రాంగోపాల్ వర్మ ఎంటర్ అయ్యారు. ఆయన చేసిన ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ‘కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అయితే గుడివాడ నుంచి చెన్నై కి వెళ్ళిన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, బుర్రిపాలెం నుంచి మద్రాసు వెళ్లిన కృష్ణ, తిరుపతి నుంచి మద్రాసు వెళ్లిన మోహన్ బాబు లోకలా? నాన్ లోకలా? ఎలా?’ అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ ట్వీట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

‘మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. బ్లూస్‌లీ నాన్ లోకల్..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. ప్రకాశ్ రాజ్ కూడా నాన్ లోకల్ అని ట్వీట్ చేశారు. కర్ణాటక నించి AP కి వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే.. మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు.. ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ? ఎలా ? ఎలా ?’ అని కామెంట్ చేశారు. ఈ ట్వీట్స్ చూసిన నెటిజన్లు.. మధ్యలో ఆర్జీవీ వచ్చిన చిచ్చు పెడుతున్నాడని వ్యాఖ్యానిస్తున్నారు.

also Non Local

Next Story

Most Viewed