ఆ కారణంగానే జగన్‌ను వదిలేస్తున్న లేదంటేనా.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్

1217

దిశ, సినిమా: ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఈ మేరకు వర్మ కీలక పాత్రలో నటిస్తున్న ‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల పొలిటిషియన్స్‌ను టార్గెట్ చేశాడని సోషల్ మీడియా టాక్. టీడీపీ, జనసేన పార్టీలకు ఆగ్రహం తెప్పించేలా ఉందంటున్నారు. అయితే అందరినీ టార్గెట్ చేసే వర్మ.. జగన్‌పై ఎందుకు సెటైర్స్ వేయడం లేదు..? ప్రత్యేక అభిమానామా? ప్రమాదకరమనే భయమా? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.

దీనిపై స్పందించిన వర్మ.. ‘జగన్ ప్రవర్తన, మాట్లాడే విధానం, వ్యవహారశైలి బలంగా ఉంటాయి. జగన్‌పై కామెడీ, స్పూఫ్‌లకు ఆస్కారం ఉండదు. అందుకే జగన్ వ్యక్తిత్వంపై స్పూఫ్‌లు చేయను. ఈ కారణంగానే తప్ప జగన్ పట్ల తనకు ప్రత్యేక అభిమానం లేదు’ అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు జగన్, చంద్రబాబు పిక్స్ షేర్ చేస్తూ ‘జగన్ రియల్ లీడర్, చంద్రబాబు రీల్ లీడర్’ అని ట్యాగ్ చేయడం విశేషం. అయితే వర్మ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

నా న్యూడ్ బాడీని ఎవరైనా చూడొచ్చు.. హీరోయిన్ ఆఫర్