చేనేత బోర్డును పునరుద్ధరించండి

by  |
చేనేత బోర్డును పునరుద్ధరించండి
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జాతీయ చేనేత బోర్డు( national handloom board)ను కేంద్ర ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని పద్మశాలి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గుండేటి శ్రీధర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్లు డిమాండ్ చేశారు. జూలై 27న కేంద్రం చేనేత బోర్డును రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా(national wide) చేనేత కార్మికులు నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వం స్పందించక పోవడాన్ని వారు ఖండించారు. ఈ నేపథ్యంలో జాతీయ చేనేత బోర్డును తిరిగి ప్రారంభించేలా చూడాలని శుక్రవారం వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి వినతి పత్రం (memorandum) సమర్పించారు. కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీని సంప్రదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని బండిసంజయ్ హామీ ఇచ్చినట్టు వారు వెల్లడించారు.



Next Story