దిశ ఎఫెక్ట్.. ‘గుట్టమాయం’.. గుట్టు రట్టు చేస్తోన్న అధికారులు

by  |
దిశ ఎఫెక్ట్.. ‘గుట్టమాయం’.. గుట్టు రట్టు చేస్తోన్న అధికారులు
X

దిశ,పెద్దపల్లి : ‘గుట్ట మాయం’ కథనం దిశలో ప్రచురితం కావడంతో జిల్లా అధికార యంత్రాంగం కదిలింది. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వేయర్‎ని పిలిపించి గుట్టను సర్వే చేశారు. ఇదే సమయంలో వర్షం కురవడంతో మరో మూడు సర్వే నెంబర్‎లు పూర్తి కాలేదని ఆర్‌ఐ రజని తెలిపారు. అంబేద్కర్ సంఘం నాయకులు ఇచ్చిన ఫిర్యాదు, దిశ పత్రికలో వచ్చిన కథనం మేరకు గుట్ట ప్రాంతాన్ని పరిశీలించి సర్వే చేయడం జరుగుతుందన్నారు. వాతావరణం అనుకూలిస్తే రెండు రోజులలో పూర్తిగా సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందని తెలిపారు. మొత్తం 34.2 ఎకరాల విస్తీర్ణంలో గుట్ట ఉందని, ఎంత వరకు కబ్జా అయిందో పూర్తిగా సర్వే చేస్తేనే తెలుస్తోందని స్పష్టం చేశారు.

దిశ పత్రికకి కృతజ్ఞతలు..

గత కొన్ని సంవత్సరాలుగా తహసీల్దార్‌కి వినతిపత్రం అందించినప్పటికీ సమస్య తీరలేదు. దిశ పత్రికలో కథనం రావడంతో వెంటనే రెవెన్యూ అధికారులు స్పందించారు. యుద్ధప్రాతిపదికన సర్వే చేసి.. కబ్జాకి గురైన భూమిని గుర్తించి మాకు న్యాయం చేయాలి. న్యాయపోరాటం చేస్తున్న నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. -తాండ్ర అంజయ్య, అంబేద్కర్ సంఘం నాయకుడు



Next Story

Most Viewed