రేవంత్ సంచలన వ్యాఖ్యలు.. వ్యసనపరులకు తెలంగాణ స్వర్గధామం

129
revanth reddy

దిశ,డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలకు కారణం విపరీతంగా మద్యం అమ్మకాలు చేయడమే అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో మాట్లాడుతున్న రేవంత్ వ్యసనపరులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని ఆరోపించారు. సైదాబాద్ చిన్నారి ఘటన జరిగి ఇన్ని రోజులు గడుస్తున్నా.. ఇంకా నిందితుడిని పట్టుకోలేదని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా సైదాబాద్ బాధితులకు న్యాయం చేయాలని కేటీఆర్ 5 రోజుల క్రితమే ట్వీట్ చేశారు. కానీ ఐదు రోజుల తర్వాత నిందితుడు దొరకలేదని పోలీసుల చేతులెత్తేశారు. నిందితుడిని అరెస్ట్ చేశారని ట్వీట్ చేసిన కేటీఆర్ కి ఏ అధికారి సమాచారం ఇచ్చాడో తెలపాలన్నారు. డ్రగ్స్ కేసును విచారించిన అకున్ సబర్వాల్ ను పంపించేశారు, దీంతో ఆ కేసును ఎక్సైజ్ శాఖ తూతూ మంత్రంగా వదిలేసిందంటూ రేవంత్ ఆరోపించారు.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..