పోరుబాటకు తొలి అడుగు పడేది ఇక్కడే.. రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్ ఇదే!

by  |
Revanth Reddy LIVE
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : కాంగ్రెస్ పార్టీ కొత్త రథ సారథి రేవంత్ రెడ్డి పోరుబాట పట్టారు. ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకుగాను క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలపై నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించే సైకిల్ యాత్ర, ఎడ్లబండ్ల ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. పార్టీ రథసారథిగా క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తొలిసారిగా, ముందుగా నిర్మల్ జిల్లాకు వస్తుండటంతో విజయవంతం చేసేందుకు నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

కాంగ్రెస్ కొత్త రథసారథిగా రేవంత్ రెడ్డి నియామకం కావటంతోనే.. పోరుబాటకు సిద్ధమైంది. ఈ నెల 7న పదవీ బాధ్యతలు తీసుకున్న ఆయన క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమయ్యారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలపై సోమవారం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే సైకిల్ యాత్ర, ఎడ్లబండ్ల ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. ఆయనతో పాటు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ పాల్గొంటారు.

కొత్త రథసారథిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్నాక.. నిర్వహిస్తున్న తొలి నిరసన కార్యక్రమం కావటం.. నిర్మల్ జిల్లాకు తొలిసారిగా వస్తుండటంతో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవార్ రామారావు పటేల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించే మహాధర్నా కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నిర్మల్ జిల్లాలోని ముధోల్, నిర్మల్, ఖానాపూర్ నియోజక వర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు తరలి రానున్నాయి.

ఇప్పటికే అవసరమైన సైకిళ్లు, ఎడ్లబండ్లను సిద్ధం చేశారు. భైంసాలో పార్టీ కార్యకర్తలతో డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్ సన్నాహాక సమావేశం నిర్వహించి.. దిశా నిర్దేశం కూడా చేశారు. ఆయా నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు మహాధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

సోమవారం ఉదయం 11గంటలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్మల్ చేరుకుంటారు. కొండాపూర్ బైపాస్ నుంచి ఓపెన్ టాప్ జీపులో ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పవార్ రామారావు పటేల్ పట్టణంలోని ర్యాలీగా వస్తారు. సెయింట్ థామస్ స్కూల్ నుంచి బైకులు, వాహనాలతో భారీ ర్యాలీగా కలెక్టరేట్ వరకు వస్తారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి.. వినతి పత్రం అందిస్తారు. అక్కడి నుంచి ఎడ్లబండ్లు, సైకిళ్లతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్తారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి.. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. కొత్త సారథి పర్యటనను విజయవంతం చేసి.. పార్టీ సత్తా చాటేందుకు శ్రేణులు ఊవ్విళ్లూరుతున్నాయి.

మహాధర్నాకు సర్వం సిద్ధం: పవార్ రామారావు పటేల్, డీసీసీ అధ్యక్షుడు, నిర్మల్

పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, నిత్యావసర ధరలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నేడు నిర్మల్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా చేస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ నిరసన కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశాం. విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. సైకిళ్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తొలిసారిగా, ముందుగా నిర్మల్ జిల్లాకు వస్తుండటంతో.. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలి.



Next Story

Most Viewed