ఛాలెంజ్‌లు చేయడం కాదు.. కేటీఆర్ ముందు ఆ పని చేయ్ : రేవంత్ ఫైర్

136
mp revanth Reddy

దిశ, వెబ్‌డెస్క్ : మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు విమర్శణాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్విట్టర్‌లో కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఛాలెంజ్‌లు చేయడం, డిబేట్స్ నుంచి పారిపోవడం వంటివి కాకుండా… రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2017 ఏప్రిల్ 13న రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. ఆ హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయిందని… కానీ ఇచ్చిన హామీని మర్చిపోయారని ఎద్దేవా చేశారు. రైతుల కోసం ఆ హామీని నెరవేర్చాలని కేటీఆర్‌ను డిమాండ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.