కేటీఆర్‌ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించిన రేవంత్ రెడ్డి

35
Revanth Reddy

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల మంత్రి కేటీఆర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్ధం పెరిగింది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శల దాడికి దిగారు. రైతుబంధు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడిని ఓ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ.. చాలెంజ్‌లు చేయడం, డిబేట్స్ నుంచి పారిపోవడం వంటివి కాకుండా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు ఉచితంగా ఎరువులు ఇస్తామని 2017 ఏప్రిల్ 13న సీఎం హామీ ఇచ్చారని రేవంత్ గుర్తుచేశారు. హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచిపోయిందని.. కానీ హామీని విస్మరించారని విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ఇప్పటికైనా ఆ హామీని నెరవేర్చాలని మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు.