పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు.. నో పర్మిషన్, నో టాక్స్

by  |
పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు.. నో పర్మిషన్, నో టాక్స్
X

దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం. అక్కడ నివసించడానికి ఒకటి లేదా రెండు గదులకే పర్మిషన్ ఉందని మనందరికీ తెలిసిందే. అలాంటిది బయ్యారంలో బహుళ అంతస్థుల నిర్మాణ కట్టడాలకు పర్మిషన్ ఏ అధికారి ఇచ్చారు. అనుమతి లేకుండానే బహుళ అంతస్థుల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయా..? అనేది మండల ప్రజల ప్రశ్నిస్తున్నారు.

బయ్యారంలో బడాబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. మా కట్టడాలు మాఇష్టం. మమ్మల్ని ఎవరు ఆపుతారో రమ్మను చూద్దాం.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండల ప్రజలు మాట్లాడుకుంటున్నారు. జిల్లాలో ఏ ఒక్క అధికారి మా వైపు చూడలేరు.. రాలేరు.. అది అంతే. అన్న చందంగా మాట్లాడుతున్నారనే టాక్ మండలంలో సంచలనంగా మారింది.

బడాబాబులకు పినపాక మండలంలో ఓ నలుగురు విలేకరులు పూర్తి మద్దతు తెలుపుతున్నారని మండలంలో టాక్ నడుస్తోంది. ప్రజా సమస్యలు, రాజకీయాలు, అవినీతి అక్రమాలు సమాజంలో జరిగే అన్ని విషయాల గురించి ప్రజలకు తెలిపేది ఒక్క విలేకరే. కానీ, ఇక్కడ వింత ఏమిటంటే బయ్యారంలో ఆ బడాబాబులకు ఈ నలుగురు విలేకరులే పూర్తి మద్దుతు తెలుపుతూ అక్రమ కట్టడాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని.. పినపాక మండలంలోని కొంతమంది విలేకరులు, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ నలుగురు విలేకరులు ఐడీ కార్డు చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.

‘దిశ’పత్రిక అక్రమ కట్టడాలపై వార్త రాయగా ఆ నలుగురు విలేకరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆ బహుళ అంతస్థులు మావే.. తమకు తెలిసిన వాళ్ళవే.. వాటి జోలికి నువ్వు పోకు.. వార్త రాయకు అని చెబుతున్నారు. అయినా, నీ పత్రిక పేపర్ రాదు కదా.. నువ్వు ఏమీ చేయలేవు అని మాట్లాడుతున్నారు.

అన్ని తెలిసి కూడా ప్రభుత్వ అధికారులే ఇలా మౌనంగా ఉంటే ఏజెన్సీ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు అనుకుంటున్నారు. బయ్యారం పంచాయతీ సెక్రెటరీ హరీష్‌ను బహుళ అంతస్థులపై వివరణ కోరగా బయ్యారంలో నిర్మిస్తున్న కట్టడాలకు దేనికి పరిమిషన్ లేదని, కనీసం ఇంటి పన్ను కూడా లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు పంపించాం. అయినా వారు వినడం లేదని సెక్రెటరీ వాపోయారు. అంటే దీనిని బట్టి బయ్యారం బడాబాబులు ఏ విధంగా రెచ్చిపోతున్నారో సెక్రెటరీ మాటల ద్వారా తేటతెల్లం అవుతోంది.

అయ్యా కలెక్టర్ సార్ ఏంటీ దారుణం..

ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు, బహుళ అంతస్థులు నిర్మిస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రజలు ఆలోచనలో పడ్డారు. కలెక్టర్ తలచుకుంటే అక్రమ బహుళ అంతస్థుల కట్టడాలు వెంటనే నిలిచిపోతాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు గుసగుసలాడుతున్నారు. జిల్లా అధికారులు అమ్ముడుపోయారని జిల్లా డీఎల్‌పీ పవన్ ద్వారా తెలిసిపోతుంది. అదిగో వస్తున్నా.. ఇదిగో వస్తున్నా అని జిల్లా డీఎల్ పీ పవన్ ఎక్కడా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమ కట్టడాల కోసం జిల్లా అధికారులు అమ్ముడుపోయారని, 10శాతం వాటా వారికి ఉందని మండలం ప్రజలు చర్చించకుంటున్నారు. కాగా, దీనిపై జిల్లా అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.



Next Story

Most Viewed