ట్రెండింగ్‌ యాప్.. ‘రిమూవ్ చైనా యాప్స్’ !

by  |
ట్రెండింగ్‌ యాప్.. ‘రిమూవ్ చైనా యాప్స్’ !
X

భారత్, చైనాల మధ్య వివాదాలతోపాటు కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ చైనాను సైడ్ చేస్తుండటాన్ని దృష్టిలో పెట్టుకుని జైపూర్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ ‘రిమూవ్ చైనా యాప్స్’ అనే ఒక యాప్‌ను ప్రవేశపెట్టింది. వన్‌టచ్‌ యాప్‌ల్యాబ్స్ వారు రూపొందించిన ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న ఫోన్‌లోని చైనా యాప్‌లను గుర్తిస్తుంది. తర్వాత వాటిని సింపుల్ యూఐ సాయంతో డిలీట్ చేస్తుంది. మే 17న రిలీజ్ అయిన ఈ యాప్‌ను కేవలం రెండు వారాల్లో 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లేస్టోర్‌లోని టాప్ ఫ్రీ యాప్‌లలో ప్రస్తుతం ఈ యాప్ మొదటిస్థానంలో ఉంది.

కొన్నిరోజుల కిందట సోనమ్ వాంగ్‌చుక్ (త్రీ ఇడియట్స్ సినిమాకు ఆదర్శం ఈయనే) ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో యువత మొత్తం చైనా ఉత్పత్తులను, యాప్‌లను నిషేధిస్తున్నారు. ఆయన బాటలోనే మోడల్ మిలింద్ సోమన్, మరికొందరు ప్రముఖులు ప్రచారం చేయడంతో ఈ ‘రిమూవ్ చైనా యాప్స్‌’కు పేరొచ్చింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఇది ట్రెండింగ్‌గా నిలిచింది.



Next Story

Most Viewed