ఆర్నబ్ గోస్వామికి ఊరట

by  |
ఆర్నబ్ గోస్వామికి ఊరట
X

న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పాల్ఘర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించపోవడంపై రిపబ్లిక్ భారత్ న్యూస్ ఛానల్‌లోని ఓ ప్రోగ్రంలో ఆర్నబ్ పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనియ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఆర్నబ్ వ్యాఖ్యానించారని పేర్కొంటూ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎలాంటి చర్యలూ తీసుకోకుండా స్టే విధించాలని కోరుతూ గోస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారణ జరిపిన జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం.. కేసులకు సంబంధించి మూడు వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, మూడు వారాల్లో ఎప్పుడైనా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.

Tags: arnab goswami, republic tv, supreme court, sc, sonia gandhi, congress, palghar incident



Next Story

Most Viewed