గుడ్‌న్యూస్.. పెట్రో ధరల తగ్గింపు కోసం కేంద్రం కీలక నిర్ణయం.!

by  |
petrol
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెరుగుతున్న పెట్రో ధరలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఇది వరకే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో చర్చలు జరిపినప్పటికీ రాష్ట్రాలు ఒప్పుకోలేదు. దీంతో ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

అయితే.. మరికొద్ది రోజుల్లోనే పెట్రోధరలను భారీగా తగ్గించేందుకు సిద్ధమైనట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో తెలిపారు. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్​(OPEC- Organization of the Petroleum Exporting Countries) మార్కెట్‌లోకి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని భావిస్తున్నదని.. తద్వారా ముడిచమురు ఉత్పత్తి పెరిగి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా క్రూడ్ఆయిల్ నిల్వలను పెంచేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.

Next Story