కరోనా రహిత గద్వాలగా మార్చాలి

by  |
కరోనా రహిత గద్వాలగా మార్చాలి
X

దిశ, మహబూబ్‌నగర్
కరోనా రహిత గద్వాలగా మార్చేందుకు వాలంటీర్లు కృషి చేయాలని ఎస్సై సత్యానారాయణ కోరారు. కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను నియమిచారు. ఇందుకు గద్వాల మున్సిపల్ పరిధిలోని 37 వార్డుల నుంచి పలువురు వాలంటీర్లుగా సేవలందించేందుకు మందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ వాలంటీర్లకు పలు సూచనలు ఇచ్చారు. రోడ్లపై ప్రజలెవరూ తిరగకుండా చూడాలని చెప్పారు. ప్రజల్ని భయపెట్టేలా కాకుండా సున్నితంగా సేవలందించాలని సూచించారు. వాలంటీర్లు తప్పని సరిగా గద్వాల పోలీస్ వారిపేరు మీద ఉన్న వైట్ టీ షర్టు ధరించి షిప్టులవారిగా విధులు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Tags: Gadwal,corona virus,volunteers, raise awareness, Gadwal

Next Story

Most Viewed