యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు డబుల్..

by  |
యాక్టివ్ కేసుల కంటే రికవరీ రేటు డబుల్..
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా రికవరీ రేటు భారీగా పెరిగిందని, ప్రస్తుతం యాక్టివ్ కేసుల కంటే డబుల్ సంఖ్యలో రికవరీ అయిన వారు ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 5,86,298 యాక్టివ్ కేసులుండగా , 12లక్షలకు పైగా పేషెంట్లు కోలుకున్నారని తెలిపింది. అలాగే, కరోనా మరణాల రేటు తగ్గుముఖం పట్టిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ విలేకరులకు వివరించారు.

మొదటి లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకు తొలిసారిగా అత్యల్ప మరణాల రేటు(2.10శాతం) నమోదైందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా టెస్టులు రెండు కోట్లను దాటాయని, గత 24 గంటల్లో 6.6 లక్షల టెస్టులు నిర్వహించినట్లు వివరించారు. 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు దేశ సగటు కన్నా ఎక్కువ టెస్టులు నిర్వహిస్తున్నాయని తెలిపారు. కొన్నిరాష్ట్రాల్లోనే కరోనా పెరుగుదల కనిపిస్తున్నదని, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు.

Next Story

Most Viewed