జత ఎడ్లకు రికార్డు ధర..!

by  |
జత ఎడ్లకు రికార్డు ధర..!
X

దిశ, వెబ్‎డెస్క్: కర్ణాటకలో ఓ జత ఎడ్ల ధర రికార్డు స్థాయిలో రూ. 17 లక్షలు పలికింది. బాగల్‎కోట్‎లోని నందగావ్‎లో సంగప్ప అనే వ్యవసాయదారు.. 2018లో జత ఎడ్లను అక్కిమారడికి చెందిన మల్లప్ప దగ్గర నుంచి రూ.8 లక్షలకు కొన్నాడు. ఆ తర్వాత సంగప్ప వాటికి రామ్‌, లక్ష్మణ్‌ అనే పేర్లు పెట్టి ఎంతో అపురూపంగా చూసుకున్నాడు.

సుమారు 48 పోటీల్లో పాల్గొన్న ఈ జత ఎడ్లు ఇప్పటివరకు సుమారు రూ.9 లక్షల ఆదాయాన్ని అందించాయి. దాదాపు అన్ని రేసుల్లోనూ తొలి రెండు స్థానాల్లోనే నిలిచేవి. కాగా, ఇప్పుడు సంగప్ప ఆ ఎడ్లను మళ్లీ మల్లప్పకే రూ.17 లక్షలకు విక్రయించాడు.



Next Story

Most Viewed