అక్కడ మధ్యాహ్నం వరకే రికార్డ్ స్థాయిలో పోలింగ్

by  |
అక్కడ మధ్యాహ్నం వరకే  రికార్డ్ స్థాయిలో  పోలింగ్
X

దిశ, ముధోల్ : బైంసాపట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు రికార్డు స్థాయి పోలింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లు 102 కాగా ఒంటి గంట వరకే 99 ఓట్లు నమోదయ్యాయి. దీంట్లో 41 మంది పురుషులు 58 మంది మహిళలు తమ ఓటును వినియోగించుకొగా ఒంటి గంట 40 నిమిషాల వరకు 98 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. తాలూకా ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, తాలూకా ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించు కొన్నారు.

Next Story