శశికళ వెనక్కి తగ్గడానికి కారణం వారిద్దరే!

by  |
శశికళ వెనక్కి తగ్గడానికి కారణం వారిద్దరే!
X

దిశ వెబ్‌డెస్క్: దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అత్యంత సన్నిహితురాలు శశికళ రాజకీయాల నుంచి తప్పుకోవడం తమిళనాట సంచలనంగా మారింది. సడెన్‌గా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికలు జరుగుతున్న క్రమంలోనే ఆమె రాజకీయాల నుంచి తప్పుకోవడంపై అనేక చర్చోపర్చచలు జరుగుతున్నాయి. ఇటీవల జైల నుంచి బయటికొచ్చిన శశకళ.. కొద్దిరోజుల పాటు సన్నిహితులు, అభిమానులతో రాజకీయాలు, ఎన్నికలపై చర్చించారు.

తమిళనాడు ఎన్నికల్లో శశికళ బరిలోకి దిగుతుందని అనుకునేలోపే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే శశికళ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి ఇద్దరు కారణమని తెలుస్తోంది. బీజేపీకి దగ్గర వ్యక్తి అయిన ఒక రాజకీయ నాయకుడు, శశికళ కుటుంబంలోని ఒక వ్యక్తి ఇందులో కీలక పాత్ర పోషించారని సమాచారం. వారిద్దరు ఒప్పించడంతోనే శశికళ రాజకీయాల నుంచి తప్పుకుందని తమిళనాట చర్చ జరుగుతోంది.

శశికళ పోటీ చేస్తే.. అధికార అన్నాడీఎంకే సీట్లు చీలి ఆ పార్టీకి నష్టం జరిగే అవకాశముంది. అందుకే ఆమెను పోటీచేయనీయకుండా ఒప్పించారట. అయితే దీనికి గాను శశికళకు ఒక హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శశికళ మేనల్లుడు దినకరన్ అన్నాడీఎంకేలో చేరడానికి సహకరిస్తామని బీజేపీ శశికళకు హామీ ఇచ్చిందనే వార్త బలంగా వినిపిస్తోంది.

Next Story

Most Viewed