భారత్‌లో లాంచ్ కానున్న Realme 9i

198
real me

దిశ, వెబ్‌డెస్క్: Realme నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలో రాబోతుంది. కొత్త ఫోన్ పేరు Realme 9i. ఇప్పటికే ఈ ఫోన్ వియత్నాంలో విడుదల అయింది. భారత్‌లో రానున్న రోజుల్లో ఈ మెుబైల్ లాంచ్ కానుంది. ఇది బ్లూ, బ్లాక్ రెండు కలర్స్‌లో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల పూర్తి-HD+ (2,400×1,080 పిక్సెల్‌లు) IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 680 SoC ద్వారా పనిచేస్తుంది. ఇది 6GB RAM 128GB సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్ కెమెరా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తోంది. దీని ధర రూ.21,200.