బ్యాంకులో డబ్బులు దాచుకునే వారికి భారీ షాక్.. RBI కొత్త రూల్స్ చదవాల్సిందే..!

by  |
banks
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకులో దీర్ఘకాలం డబ్బులు దాచుకునే వారికోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్స్/ టర్మ్ డిపాజిట్ల నిబంధనలు సవరించినట్లు పేర్కొంది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేటు ఏదేని బ్యాంకుల్లో డబ్బులు దాచుకునే వారు కచ్చితంగా ఈ రూల్స్ చదవాల్సిందే. లేనియెడల బ్యాంకులు తీసుకునే నిర్ణయాలకు బాధ్యులవుతారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఫిక్స్‌డ్, టర్మ్ డిపాజిట్ల మెచ్యూరిటీ గుడువు తీరిన తర్వాత డబ్బులు తీసుకోకపోతే.. ఆ డబ్బులపై బ్యాంకులు తక్కువ వడ్డీ చెల్లిస్తాయి. సేవింగ్స్ ఖాతాలకు వర్తించే వడ్డీ రేటే వాటికి వర్తింపజేయనున్నారు. అయితే ప్రస్తుతం మెచ్యూరిటీ తీరిన తర్వాత ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బులు తీసుకోకపోతే బ్యాంకులు వాటిని మళ్లీ రెన్యూవల్ చేస్తున్నాయి.

కొత్త రూల్స్‌కు సంబంధించి RBI సర్క్యూలర్ కూడా జారీ చేసింది. FD డబ్బులు గడువు తీరిన తర్వాత కూడా తీసుకోకపోతే తక్కువ వడ్డీ వస్తుంది. కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు, లోకల్ రీజినల్ బ్యాంకులకు సైతం ఆర్‌బీఐ రూల్స్ వర్తించనున్నాయి. కావున, కస్టమర్లు అందరూ డబ్బులు సేవింగ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



Next Story

Most Viewed