RBI గుడ్‌న్యూస్.. నెఫ్ట్, RTGS సేవలు వారికి కూడా..

by  |
RBI గుడ్‌న్యూస్.. నెఫ్ట్, RTGS సేవలు వారికి కూడా..
X

దిశ, వెబ్‌డెస్క్: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు ఒకరి నుంచి మరొకరికి ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఉపయోగపడే ఆర్టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఇప్పటివరకు బ్యాంకులు మాత్రమే వినియోగించుకోవడానికి వీలుంది. న్యాన్ బ్యాంకింగ్ సంస్థలు ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియలో ఆర్‌బీఐ మార్పులు తీసుకొచ్చింది.

కరోనా మళ్లీ తీవ్రరూపం దాల్చుతున్న క్రమంలో డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేందుకు ఆర్‌బీఐ ముందుకొచ్చింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ పేమెంట్ సేవలను ఇప్పటినుంచి న్యాన్ బ్యాంకింగ్ ఆపరేటర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ప్రిపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ PPI, కార్డ్ నెట్‌వర్క్స్, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు, ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ప్లాట్‌ఫామ్స్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలను వినియోగించుకోవచ్చంది.

అటు పేమెంట్స్ బ్యాంక్ డిపాజిట్ లిమిట్‌ను రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

Next Story

Most Viewed