రికవరీకి సమయం పడుతుంది : రేమండ్ గ్రూప్!

by  |
రికవరీకి సమయం పడుతుంది : రేమండ్ గ్రూప్!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి నుంచి రికవరీ సాధించగలమని టెక్స్‌టైల్, ఫ్యాషన్ రంగంలో మెజారిటీ వ్యాపారాన్ని కలిగిన రేమండ్ గ్రూప్ ఆశాభావం వ్యక్తం చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కరోనా ప్రభావం వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని, దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఈ రంగం ఫ్లాట్‌గా ముగుస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉన్నామని రేమండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా చెప్పారు. ఈ ఏడాదిలో సుమారు ఆరు నెలల పాటు వ్యాపారాలు నిలిచిపోయాయని, ఇది టెక్స్‌టైల్ రంగానికి కఠినమైన పరిస్థితి. కాబట్టి, ఈ ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి వృద్ధి ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

వ్యాపార పునరుద్ధరణపై ఆశలున్నాయని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ, కొన్ని విభాగాల్లో కరోనా ముందునాటి స్థాయిలో అమ్మకాలు సాధించగలిగామని, అయితే, దుస్తుల వ్యాపార పునరుద్ధరణకు ఎక్కువ సమయం పట్టొచ్చని తెలిపారు. హోల్‌సేల్ మార్కెట్లు ఎక్కువ కాలం మూసి వేసినందువల్ల కోలుకునేందుకు కొంచెం సమయం పడుతుందని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో సరైన నిర్ణయాలను అమలు పరిచి బయటపడగలమని నమ్ముతున్నామని గౌతమ్ చెప్పారు.

Next Story

Most Viewed