టైం ఓవర్.. వడ్లు కొనం.. ‘ఉరే’ శరణ్యమంటున్న రైతులు?

by  |
టైం ఓవర్.. వడ్లు కొనం.. ‘ఉరే’ శరణ్యమంటున్న రైతులు?
X

దిశ, ఇందల్వాయి : నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండల కేంద్రంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఆదివారం రైతులు ధాన్యాన్ని అమ్మేందుకు రాగా, టైం అయిపోయిందని.. ఇక కళ్లాల్లో మిగిలిన ధాన్యం కొనేది లేదంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలుపోక అన్నదాత తలపట్టుకున్నాడు.

అప్పులు చేసి మరీ ఈ ఏడు వరి సాగుచేశామని, ఎక్కడ ధాన్యం అక్కడే కళ్లాల్లో ఉండిపోయిందని.. ఇప్పుడేమో సమయం గడిచిపోయిందని తాము వడ్లు కొనబోమని చెబితే తమకు ఉరే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో మ్యాచర్ పేరుతో దాదాపుగా 15 నుంచి 20 రోజులుగా ధాన్యాన్ని కాంటాలు చేయడం లేదని అన్నారు. కల్లాలలో మిగిలిపోయిన ప్రతి గింజనూ కొంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మాట మార్చిందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో మిగిలిపోయిన ప్రతీ గింజను కొనుగోలు చేయాలన్నారు. లేనిపక్షంలో భారీగా ఆందోళనలు చేస్తామని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Next Story

Most Viewed