‘రావణాసుర’ ను ప్రారంభించిన మెగాస్టార్.. రవితేజ ఫస్ట్ లుక్ రిలీజ్

49

దిశ, సినిమా :  సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘రావణాసుర’. భోగి పండగ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలను నేడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. ‘రావణాసుర’ చిత్రం నుంచి రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, బాబి, గోపీచంద్ మలినేని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అభిషేక్ పిక్చర్స్ – ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకాలపై అభిషేక్ నామా, శ్రీకాంత్ విస్సా కలిసి నిర్మిస్తున్న చిత్రాన్ని 2022 సెప్టెంబర్ 30న విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు.