ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడిగా రవీందర్ రెడ్డి

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లోని రెవెన్యూ భవన్‌లో జరిగాయి. 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, సీసీఎల్ఏ యూనిట్ కార్యవర్గ సభ్యులు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె.గౌతమ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా మన్నె ప్రభాకర్, పి.రాజ్ కుమార్, ఎం.డి.రియాజుద్దీన్, పూల్ సింగ్ చౌహన్, కోశాధికారిగా బి.వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షులుగా ఎల్.బి.శాస్త్రి, బాణాల రాంరెడ్డి, కె.శ్రీనివాస్ రావు, ఎ.రాజేశ్వర్, డి.మధుసూదన్, కె.నిరంజన్ రావు, కె.నాగమణి, ఎండీ అన్వర్, క్రీడలు, సాంస్కృతిక కార్యదర్శిగా బి.రవీందర్, కార్యదర్శులుగా శ్రీకాంత్ రెడ్డి, పి.యాదగిరి, టి.వాణిరెడ్డి, కె.మంజుల, మాధవిరెడ్డి, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ చక్రవర్తి, కె.వెంకట్ రెడ్డి, సయ్యద్ మౌలానా, చిల్లా శ్రీనివాస్, కృష్ణ చైతన్య, శ్రీనివాస్ దేశ్ పాండే, కార్యవర్గ సభ్యులుగా నజీమ్ ఖాన్, దేశ్య నాయక్ తదితరులను ఎన్నికయ్యారు.

ఎన్నికల అధికారిగా రాష్ట్ర కోఆర్డినేటర్ ఎం.నారాయణ్ రెడ్డి వ్యవహారించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 100 శాతం సభ్యత్వం పూర్తయిన తర్వాత ప్రజాస్వామ్యబద్దంగా 73 రెవెన్యూ డివిజన్లు, 33 కలెక్టరేట్ యూనిట్లలో గత నెలలో ఎన్నికలు జరిగాయి. అలాగే 33 జిల్లాల్లో ఇటీవల ట్రెసా కార్యవర్గ ఎన్నికలు పూర్తయ్యాయి.

Teresa State Committee

రెవెన్యూ శాఖ పటిష్టత కోసం కృషి చేస్తాం

రెవెన్యూ శాఖ పటిష్టత కోసం, రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమం, హక్కుల కోసం ట్రెసా నిరంతరం పని చేస్తుందని రెండో సారి అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నికైన వంగా రవీందర్ రెడ్డి, కె.గౌతమ్ కుమార్‌లు అన్నారు. వివిధ కేడర్ల పదోన్నతులు సాధిస్తామని, పెండింగ్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాపై నమ్మకముంచి మరోసారి అవకాశం కల్పించిన రెవెన్యూ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story