ఫ్లెక్సీలో ఫోటోలు ఎలా వాడుతారు?

63

దిశ, పరకాల: తన ప్రమేయం లేకుండానే ఫ్లెక్సీలో ఫోటోలు ఎలా వాడుతారు అంటూ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ఇమ్మడిశెట్టి రవీందర్ మాజీ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి వర్గీయులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తన ప్రమేయం లేకుండానే తన ఫోటోలను ప్రింట్ చేయించి ఫ్లెక్సీలో పెట్టడం పట్ల రవీందర్ తీవ్రంగా స్పందించారు. కొంతమంది తనను రాజకీయంగా అణగదొక్కడం కోసం చేస్తున్న కుట్రగా ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులమని చెప్పుకుంటూనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం సిగ్గుచేటని మధుసూదనాచారి వర్గీయులను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు.

అలాంటి వాళ్ల మూలంగా మండల పార్టీకి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లు పార్టీని భ్రష్టు పట్టించాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. గండ్ర దంపతుల సారధ్యంలో మండల అభివృద్ధి కోసం ప్రతిఒక్కరూ పాటు పడాల్సిన అవసరం ఉందంటూ సూచించారు. తాను వారి అడుగుజాడల్లో పార్టీ కోసం పని చేస్తానని, వర్గ వైషమ్యాలతో తనకు అవసరం లేదంటూ స్పష్టం చేశారు. తన పేరుతో ఎలాంటి ప్లెక్సీలు ఉండకూడదని, ఇప్పటికే పెట్టిన ఫ్లెక్సీలు ఉంటే తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..