ఆ హీరోయిన్‌కు భయపడి క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న రష్మిక..

by  |
ఆ హీరోయిన్‌కు భయపడి క్రేజీ ఆఫర్ మిస్ చేసుకున్న రష్మిక..
X

దిశ, సినిమా : క్యూట్ బ్యూటీ రష్మిక మందన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. శాండల్‌వుడ్, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా నాలుగు ఇండస్ట్రీల్లోనూ బిజీ అయిపోయింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘మిషన్ మజ్ను, గుడ్ బై’ సినిమాలు చేస్తున్న రష్మికకు.. ఈ ప్రాజెక్ట్‌ల కంటే ముందే బీటౌన్ నుంచి ఆఫర్ వచ్చినా తిరస్కరించిందట. అంతేకాదు షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న హిందీ ‘జెర్సీ’ రీమేక్‌లో హీరోయిన్ క్యారెక్టర్‌ కోసం ముందుగా తననే అప్రోచ్ అయినా.. నో చెప్పిందని సమాచారం. అయితే తెలుగు ‘జెర్సీ’లో ఫిమేల్ లీడ్‌గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ పర్‌ఫార్మెన్స్ చూశాక.. ఆ పాత్రకు తనకన్నా గొప్పగా న్యాయం చేయలేనని భావించే హిందీ ‘జెర్సీ’కి అంగీకరించలేదట రష్మిక. కాగా జెర్సీని తెలుగులో తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి.. హిందీ ప్రాజెక్ట్‌కు కూడా దర్శకత్వం వహిస్తుండగా, షాహిద్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed