దారుణం : మైనర్ బాలుడిపై అత్యాచారం చేసి.. చివరకు

370
Rape attempt

దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల మైనర్ బాలుడి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే.. గురునానక్ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులందరూ వేడుకలు చేస్తుండగా బాలుడు తప్పిపోయాడు. అతని కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుని కోసం వెతకగా, ప్రావిన్స్‌లో ఖైర్ పూర్ మీర్ ప్రాంతంలోని బబార్లోయ్ పట్టణంలో ఓ పాడుబడిన ఇంట్లో బాలుని మృత దేహాం లభ్యం అయ్యింది. మృతదేహాన్ని శవ పరిక్షలు నిర్వహించగా, రిపోర్ట్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. బాలుడిపై అత్యాచారం చేసి, అనంతరం గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై పోలీసు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..