HYD: గాంధీ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్‌గా డాక్టర్ రమేష్​రెడ్డి

by  |
Ramesh Reddy, Gandhi Medical College
X

దిశ, తెలంగాణ బ్యూరో: గాంధీ మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రస్తుతం టెంపరరీ డీఎంఈగా కొనసాగుతున్న డాక్టర్ రమేష్​రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆయనతో పాటు మరో 30 మంది ప్రొఫెసర్లకు అడిషనల్ డీఎంఈలుగా పదోన్నతులు కల్పిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు వీరికి బాధ్యతలు అప్పగిస్తూ హెల్త్ సెక్రటరీ రిజ్వీ మంగళవారం జీఓ జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారికి ప్రభుత్వ మెడికల్​ కాలేజీల్లో ప్రిన్సిపాల్‌గా, దాని అనుబంధ ఆసుపత్రుల్లో సూపరింటెండెంట్లుగా పోస్టింగ్‌లు ఇచ్చారు. అయితే డీపీసీ(డీపార్ట్​మెంటల్ ప్రమోషన్ కమిటీ) పూర్తైనా నాలుగు నెలలు తర్వాత పదోన్నతులు పొందిన వారికి పోస్టింగులు ఇవ్వడం గమనార్హం.

ఇదిలా ఉండగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు సార్లు అడిషనల్​డీఎంఈల ప్రమోషన్లు జరుగుగా, స్వరాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ పదోన్నతులపై కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎన్ని అడ్డంకులు తీసుకువచ్చినా ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు ప్రత్యేక చొరవతో ప్రమోషన్లు వచ్చాయని మెడికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రమేష్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



Next Story

Most Viewed