మగాడు ఏడిస్తే జుగుప్స పుడుతుంది.. చంద్రబాబు‌ కన్నీటిపై ‘RGV’ మార్క్

by  |
మగాడు ఏడిస్తే జుగుప్స పుడుతుంది.. చంద్రబాబు‌ కన్నీటిపై ‘RGV’ మార్క్
X

దిశ, వెబ్‌డెస్క్: తన భార్యను కించపరిచేలా మాట్లాడారని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయంలోనూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన శైలిలో రియాక్ట్ అయ్యాడు. ‘ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని ఎవరో పూర్వీకులు చెప్పారని నేను ఎప్పుడో విన్నాను.. కానీ నేను నవ్వే ఆడదాన్ని ఇష్టపడతాను, ఎందుకంటే చూడటానికి బాగుంటుంది కాబట్టి, కానీ బలం, ధైర్యం చూపించాల్సిన మగాడు పబ్లిక్‌లో ఏడిస్తే జాలి కాదు, జుగుప్స పుడుతుంది’ అంటూ రాంగోపాల్ వర్మ సెటైరికల్ ట్వీట్ చేశాడు.


Next Story

Most Viewed