అల్లు అర్జున్‌పై RGV ప్రశంసలు.. పవన్ కల్యాణ్, మహేశ్‌ బాబులకు సవాల్

by  |
Ram Gopal Varma, allu arjun
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు. ఎప్పుడూ ఎవరినో ఒకరిని విమర్శించే వర్మ గతకొంతకాలంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే గతంలో ఒక కమెడియన్ మనవడిగా మొదలు పెట్టి స్టార్ హీరోగా ఎదిగాడంటూ బన్నీని పొగిడిన ఆర్జీవీ, తాజాగా.. మరోసారి బన్నీని ఆకాశానికెత్తేశాడు. సోమవారం అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘పుష్ప-1’ సినిమా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ.. తెలుగులో రియలిస్టిక్ క్యారెక్టర్లను చేయడానికి ఏమాత్రం భయపడని ఒకే ఒక్క సూపర్ స్టార్ అల్లు అర్జున్ అని వర్మ అన్నారు. ఇలాంటి పాత్రలను పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, చిరంజీవి, రజనీకాంత్ తదితరులు చేయగలరా? అని ప్రశ్నించారు. అంతేగాకుండా.. ‘పుష్ప’ అంటే పుష్పం కాదని.. అది ఫైర్ అని ట్రైలర్‌లో బన్నీ చెప్పిన డైలాగ్‌ను జోడిస్తూ వర్మ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed