బికినీలో వర్మ ఫస్ట్ లవర్.. ఆయన ఇలా అవ్వడానికి కారణం ఆమెనట..

by  |
బికినీలో వర్మ ఫస్ట్ లవర్.. ఆయన ఇలా అవ్వడానికి కారణం ఆమెనట..
X

దిశ, వెబ్‌డెస్క్: వర్మ.. వర్మ.. వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వర్మ హల్చల్ చేస్తున్నాడు. కొన్నేళ్లుగా వివాదాలతోనే సహజీవనం చేస్తున్న వర్మ రోజుకో వివాదానికి తెరలేపుతున్నాడు. వోడ్కా తాగి చిందులేసినా, హీరోయిన్లతో అసభ్యంగా ప్రవర్తించినా, స్టార్ హీరోలపై అనుచిత వ్యాఖ్యలు చేసినా వర్మ రూటే సపరేట్. ఎవరు ఏమనుకుంటారన్నది వర్మకు అనవసరం. ఇక ఇటీవలే ఓ అమ్మాయితో ఆడిపాడి ర‌చ్చ చేసి ఆ వీడియో షేర్ చేసిన వ‌ర్మ రీసెంట్‌గా బ‌న్నీని మెగాస్టార్ అంటూ ఆకాశానికి ఎత్తాడు. ఇక వీటి గురించే నెటిజన్లు మాట్లాడుకోవడం తగ్గలేదు.. అంతలోనే మరో బాంబ్ పేల్చాడు తన ఫస్ట్ లవర్ అంటూ ఒక మహిళ బికినీ వేసుకొని ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇంకేముంది వర్మ లవరా.. ఎవరు అంటూ నెటిజన్లు ఓ చూపు చూస్తున్నారు.

For more Hot & Trending news Join Telegram group for Hot news

https://t.me/cutww

“ఈ బ్లూ బికినిలో ఉన్న ఆమె పేరు సత్య, విజయవాడ సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సమయంలో నా మొదటి లవర్ ప్రస్తుతం ఆమె యూఎస్‌లో మెటర్నిటీ డాక్టర్‌గా పని చేస్తుంది. అప్పట్లో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ ఒకే దగ్గర ఉండేవి. అప్పుడే ఆమెపై నా వన్ సైడ్ లవ్ స్టార్ట్ అయ్యింది. నేను ప్రేమలో పడ్డాను కానీ ఆమె మాత్రం అమెరికాలోని ఒక రిచ్ అబ్బాయి కారణంగా నన్ను కేర్ చేయలేదు.. ఇది దృష్టిలో పెట్టుకొనే ‘రంగీలా’ కథ రాసాను” అని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా మరో ట్వీట్ లో క్షణక్షణం చిత్రంలో శ్రీదేవి పేరు సత్య అని పెట్టడానికి కూడా తన లవర్ యే కారణమని చెప్పాడు. ప్రస్తుతం తను మియామి బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నదని, ఆమె తనకు పంపిన ఫోటోలనే ఇప్పుడు పోస్ట్ చేశానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ట్వీట్స్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. హమ్మయ్య బతికిపోయింది. నిన్ను ప్రేమించి ఉంటే ఇలా బీచ్ లో కాకూండా వేరేచోట ఉండాల్సి వచ్చేది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Next Story

Most Viewed