రకుల్‌ తప్పు చేసిందా?

by  |
రకుల్‌ తప్పు చేసిందా?
X

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కెరియర్ కష్టాల్లో పడింది. మొదట్లో హీరోయిన్‌గా వరుస ఆఫర్లు దక్కించుకున్న ఈ భామ.. ఫుల్ జోష్‌గా ఉండేది. ఓ టైంలో మెగా కాంపౌండ్ హీరోయిన్‌ అనిపించుకున్నా… ప్రస్తుతం మాత్రం చేతిలో ఒక్క అవకాశం లేదు. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు సక్సెస్ ఫుల్‌గా దూసుకెళ్తుండగా తాను మాత్రం ఖాళీగా కూర్చోవడంపై బాధపడిపోతుందట. గ్లామర్ డాల్‌గా పేరు తెచ్చుకోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రకుల్. నటనా ప్రాధాన్యత పాత్రలు ఎంచుకోకుండా వరుసగా గ్లామరస్ పాత్రలు చేశానని… అందుకే అవకాశాలు తగ్గిపోయాయని తెలిపింది. అది ఎంత తప్పో ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుందని చెప్పింది. అందుకే హిట్ సినిమాలు చేసినా సరే… ఛాన్స్‌లు మాత్రం రావడం లేదంది. కానీ నా కెరియర్‌లో నిర్మాతలు, దర్శకులను ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవని వెల్లడించింది రకుల్.

tags : Rakul Preet Singh, Mega Heroine, Glamorous roles

Next Story

Most Viewed