ఫొటో షేర్ చేసి.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన రకుల్

by  |

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ ఫొటోను చూసిన నెటిజన్స్ తెగ వైరల్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బాస్కెట్ చాట్ తో ఉన్న ఓ ఫొటోను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అదేవిధంగా ఆహారం, ఫిట్‌నెస్‌, లేదా పని నుంచి చిన్న విరామం తీసుకొని జీవితాన్ని ఆస్వాదించటం చాలా ముఖ్యమంటూ అందులో పేర్కొన్నది.

లక్నోలో బాస్కెట్‌ చాట్ ప్లేట్‌ను ఎటువంటి గిల్టీ లేకుండా ఆస్వాదిస్తున్నట్లు ఓ నటుడు షేర్‌ చేసిన ఫొటో గ్లింప్స్‌ తాను చూశానని, చాలా మంది ఎక్కువ కేలరీల ఉన్న ఫుడ్‌కు దూరంగా ఉన్నప్పటికీ, వర్క్‌అవుట్స్‌తో కేలరీలను కరిగించేయవచ్చునని రకుల్‌ రాసుకొచ్చింది. మనందరికీ ఒక్కోసారి ట్రీట్‌ మీల్స్‌ అవసరమని తాను నమ్ముతున్నాని, దీనికి తన ఫిట్‌నెస్‌ ట్రైనెర్‌ మున్మున్‌ గనేరివాల్‌ కూడా ఒప్పుకున్నట్లు కూడా ఆమె తెలిపింది. మధ్యాహ్నం 1-4 గంటల మధ్య సరైన సమయంలో మీ చాట్ తినండి అంటూ తన ఫ్యాన్స్‌కు రకుల్ సలహా ఇచ్చింది. అబ్బాయిలు.. విందు కోసం కాదు.. వారానికి ఒకసారి కంటే ఎక్కువ కాదు అంటూ కండీషన్స్‌ అప్లై అన్నట్లు రకుల్‌ పేర్కొన్నది. ఈ చాట్‌తో తాను చాలా హ్యాపీగా ఉన్నానని, ఆ ఉత్సాహాన్ని నా ముఖంలో చూడవచ్చంటూ ఫొటోను షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్స్ షేర్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

విడాకుల తర్వాత చై నిర్ణయం ఏంటి.. వాటిని సామ్‌కి ఇచ్చేస్తాడా.. ?

Next Story

Most Viewed