బట్లర్ బాదాడు.. చెన్నై ఓడింది

by  |
బట్లర్ బాదాడు.. చెన్నై ఓడింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 37 మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల భారీ తేడాతో చెన్నైను చిత్తు చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 17.3 ఓవర్లలోనే టార్గెన్‌ను ఛేదించారు. టాప్ ఆర్డర్ విఫలమైనా.. మిడిలార్డర్‌లో వచ్చిన జోస్ బట్లర్ 48 బంతుల్లో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక స్టీవ్ స్మిత్ 26 పరుగులతో రాణించాడు. దీంతో రాజస్తాన్ విజయం లాంఛనమైంది.

రాజస్తాన్ ఇన్నింగ్స్:
126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ తొలుత తడబడ్డారు. ఓపెనర్లు బెన్ స్టోక్స్ (19), రాబిన్ ఉతప్ప (4), సంజూ శాంసన్ (0) డకౌట్‌తో వెనుదిరిగారు. దీంతో 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్ పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఇక ఇదే సమయంలో వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇతనికి తోడుగా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 17.3 ఓవర్‌లోనే రాజస్తాన్ విజయం సాధించింది.

CSK ఇన్నింగ్స్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 125 పరుగులకే పరిమితం అయింది. ముఖ్యంగా రాజస్తాన్ బౌలర్లు, ఫీల్డర్లు బ్యాట్స్‌మెన్లను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టి పరుగులను కట్టడి చేశారు.

తొలుత టాప్ ఆర్డర్‌లో వచ్చిన శామ్ కుర్రాన్ (22), డు ప్లెసిస్ (10), షేన్ వాట్సన్ (8) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. దీంతో మూడు వికెట్ల నష్టానికి CSK స్కోరు 53కు చేరింది. మిడిలార్డర్‌లో వచ్చిన అంబటి రాయుడు (13), ఎంస్ ధోని (28) పరుగులు చేసి వికెట్లు కోల్పోయారు. దీంతో 107 పరుగుల వద్ద చెన్నై 5 వికెట్లను కోల్పోయింది.

ఇక ఆ తర్వాత వచ్చి రవీంద్ర జడేజా (34), కేదర్ జాదవ్ (4)పరుగులతో నాటౌట్‌గా నిలిచి స్కోరు బోర్డును కాస్తా ముందుకు లాగి 125 వరకు తీసుకొచ్చారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సీఎస్కే జట్టు 125 పరుగులకే పరిమితం అయింది.

స్కోరు బోర్డు:

Chennai Super Kings Innings125-5 (20 Ov)

1. శామ్ కుర్రాన్ c జోస్ బట్లర్ b శ్రేయస్ గోపాల్ 22(25)
2. ఫాఫ్ డు ప్లెసిస్ c జోస్ బట్లర్ b జోఫ్రా ఆర్చర్ 10(9)
3. షేన్ వాట్సన్ c రాహుల్ తెవాతియా b కార్తీక్ త్యాగి 8(3)
4.అంబటి రాయుడు c శాంసన్ b రాహుల్ తెవాతియా 13(19)
5 ఎంస్ ధోని (c) (wk) రనౌట్ (జోఫ్రా ఆర్చర్ /శాంసన్) 28(28)
6. రవీంద్ర జడేజా నాటౌట్ 34*(29)
7. కేదర్ జాదవ్ నాటౌట్ 4*(7)

ఎక్స్‌ట్రాలు: 5

మొత్తం స్కోరు: 125-5

వికెట్ల పతనం: 13-1 (ఫాఫ్ డూ ప్లెసిస్, 2.6), 26-2 (షేన్ వాట్సన్, 3.6), 53-3 (శామ్ కుర్రాన్, 8.2), 56-4 (అంబటి రాయుడు, 9.6), 107-5 (ఎంస్ ధోని, 17.4).

బౌలింగ్:
1. జోఫ్రా ఆర్చర్ 4-0-20-1
2. అంకిత్ రాజ్‌పుత్ 1-0-8-0
3. కార్తీక్ త్యాగి 4-0-35-1
4. బెన్ స్టోక్స్ 3-0-27-0
5. శ్రేయస్ గోపాల్ 4-0-14-1
6. రాహుల్ తెవాతియా 4-0-18-1

Rajasthan Royals Innings112-3 (16 Ov)

1.బెన్ స్టోక్స్ b D చాహర్ 19(11)
2.రాబిన్ ఉతప్ప c ధోని b హజిల్‌వుడ్ 4(9) 0044.
3.సంజూ శాంసన్ (wk)c ధోని b D చాహర్ 0(3)
4. స్టీవ్ స్మిత్ (c) 26 (34)
5. జోస్ బట్లర్ నాటౌట్ 70(48)

ఎక్స్‌ట్రాలు: 7

మొత్తం స్కోరు: 126-3

వికెట్ల పతనం: 26-1 (బెన్ స్టోక్స్, 2.6), 28-2 (రాబిన్ ఉతప్ప, 3.2), 28-3 (సంజు శాంసన్, 4.3)

బౌలింగ్:
1. దీపక్ చాహర్ 4-1-18-2
2. జోష్ హజిల్‌వుడ్ 4-0-19-1
3. రవీంద్ర జడేజా 1.3-0-11-0
4. శార్దుల్ ఠాకూర్ 4-0-34-0
5. శామ్ కుర్రాన్ 1-0-6-0
6. పియూశ్ చావ్లా 3-0-32-0

Next Story

Most Viewed