రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకున్న స్టార్ బ్యాట్స్‌మెన్..

66
rajpaksa

కొలంబో: శ్రీలంక బ్యాటర్ బానుక రాజపక్స తన రిటైర్మెంట్‌పై యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా, తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు శ్రీలంక క్రికెట్‌ బోర్డు(ఎస్‌ఎల్‌సీ)కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని ఎస్‌ఎల్‌‌సీ ధ్రువీకరించింది. ‘క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స, జాతీయ సెలెక్టర్లను సంప్రదించిన తర్వాత బానుక రాజపక్స తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు లేఖ రాశాడు. శ్రీలంక తరఫున ఆటను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు’ అని శ్రీలంక క్రికెట్ బోర్డు పేర్కొంది. జనవరి 3న రాజపక్స వ్యక్తిగత కారణాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.