తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు

38

దిశ, తెలంగాణ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే మూడు రోజుల వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు ఉపసంహరించినా.. తూర్పు-మధ్య ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం గురువారం బంగాళాఖాతం వైపు కేంద్రీకృతమైందని, దీని ప్రభావంతో వర్షాలు పడే ఛాన్స్​ ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రయాణాలు చేసే వారు, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..