ధోని రిటైర్మెంట్‌పై రైనా సంచలన వ్యాఖ్యలు

by  |
ధోని రిటైర్మెంట్‌పై రైనా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిపై సహచర క్రికెటర్ సురేష్ రైనా సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని ఈ సారి టైటిల్ గెలవకపోతే రిటైర్ అవుతాడేమో అని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. యూఏఈలో జరుగనున్న మలి దశ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కనుక టైటిల్ గెలిస్తే ధోనిని మరో రెండేళ్ల పాటు క్రికెట్ ఆడటానికి ఒప్పిస్తానని రైనా అన్నారు. ‘నేను మరో నాలుగైదేళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉన్నది. ఐపీఎల్‌లో అప్పటి వరకు కొనసాగుతాను. నేను కేవలం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మాత్రమే ఆడాలని అనుకుంటున్నాను. ఈ ఏడాది కనుక చెన్నై జట్టు టైటిల్ గెలిస్తే ధోని మరో రెండేళ్ల పాటు క్రికెట్ ఆడేలా నేను ఒప్పించడానికి ప్రయత్నిస్తాను. ధోని కనుక క్రికెట్ ఆడటం మానేస్తే నేను కూడా మానేస్తాను’ అని రైనా వ్యాఖ్యానించాడు. గత ఏడాది అగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. అదే రోజు రైనా కూడా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వీరిద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. అందుకే ధోని విషయంలో రైనా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story

Most Viewed