సంక్రాంతి రోజు అక్కడ వడగండ్ల వాన

75
vana11

దిశ, ఓదెల: శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షం కారణంగా ఓదెల మండలంలోని కనగర్తి, మడక, జీల కుంట, ఓదెల, పోతక పల్లి గ్రామాల్లో వడగండ్ల వాన ఈదురు గాలులకు 50 ఎకరాల మొక్కజొన్న నేలమట్టం అయింది. పత్తి రంగు మారడంతో పెట్టుబడులు కూడా రావని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా మొక్కజొన్న రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అకాల వర్షాలకు వరి రంగు మారి రోగాల బారిన పడే పరిస్థితి ఉందని పలువురు రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే దిగుబడి లేక అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ఈ అకాల వర్షం మళ్ళీ అప్పులోకి నెట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వరి సాగు చేయొద్దని చెప్పడంతో చాలామంది రైతులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న వేశారు. కొలనూరు నుంచి పెద్దపల్లి కి వెళ్లే రహదారిపై చెట్లు విరిగి పడడంతో పూట ప్రయాణికులు ఇబ్బందులు గురయ్యారు.