హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..

by  |
rain in Hyderabad
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లో ఒక్కసారిగా మళ్లీ వాతావరణం మారిపోయింది. ఈరోజు సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నాగోలు, వనస్థలిపురం, ఎల్బీ నగర్, తార్నాక, హయత్ నగర్, ఉప్పల్, పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. అయితే, మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ, తమిళనాడులోని పలు ప్రాంతాల మీదుగా అల్ప పీడన ప్రభాతం కొనసాగుతున్నందు వల్ల నేడు, రేపు కూడా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


Next Story