అల్ప పీడనం ఎఫెక్ట్.. తెలంగాణకు వర్ష సూచన

158
Rain alert in telangana

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో ఈ నెల 13,14,15 వరకు విస్తారంగా వర్షాలు కురియనున్నాయి.

శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 3.8 మీమీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 26.3 మీమీ వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా మహబూబాబాద్‌లో 0.7 మీమీ వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా ఆదిలాబాద్‌లో 13మీమీ, కొత్తగూడెంలో 1.1 మీమీ, హైదరాబాద్‌లో 0.8 మీమీ, భూపాలపల్లిలో 7.3 మీమీ, జగిత్యాలలో 2.3 మీమీ, జనగాంలో 2.3 మీమీ, కరీంనగర్‌లో 1.5 మీమీ, ఖమ్మంలో 8.7 మీమీ, మల్కాజ్‌గిరిలో 2.7 మీమీ, మంచిర్యాలలో 10.3 మీమీ, మెదక్‌లో 3.1 మీమీ, ములుగులో 5.6మీమీ, నిజామాబాద్‌లో 2.5 మీమీ, పెద్దపల్లిలో 1.6 మీమీ, రాజన్న సిరిసిల్లలో 3.6 మీమీ, రంగారెడ్డిలో 1.4 మీమీ, సంగారెడ్డిలో 3 మీమీ, సిద్ధిపేటలో 0.8 మీమీ, సూర్యాపేటలో 2.5 మీమీ, వికారాబాద్‌లో 4.2 మీమీ, వరంగల్ రూరల్‌లో 2.2 మీమీ, వరంగల్ అర్బన్‌లో 0.8 మీమీ, యాదాద్రి భువనగిరిలో 1.1 మీమీ వర్షపాతం నమోదైంది.

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..