రైతుల్లో ఆనందం.. నిలుస్తుందా?

by  |
రైతుల్లో ఆనందం.. నిలుస్తుందా?
X

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రైతుల్లో నైరుతీ రుతుపవనాలు ఆశల మోసుకొచ్చాయి. ఎప్పట్లా జూన్‌లోనే ఖరీఫ్ సీజన్‌ను ఆరంభించేలా వర్షాలు కురిశాయి. గత పది రోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. మబ్బులు పడుతున్నప్పటికీ వరుణుడు మాత్రం కరుణించడం లేదు. అయితే నెల ఆరంభంలోనే విస్తారంగా వర్షాలు కురవడంతో ఏడు జిల్లాల్లో రైతులు ఖరీఫ్ సీజన్ ఆరంభించారు.

30 ఏళ్ల ఖరీఫ్ సీజన్ సగటు వర్షపాతంతో పోలిస్తే… జూన్ 1 నుంచి జూన్ 26వ తేదీ వరకు అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 58 శాతం వర్షపాతం నమోదైందని వాతావరణ విభాగం వెల్లడించింది. ఆ తరువాతి స్థానాల్లో గుంటూరు 43 శాతం, కర్నూలు 38 శాతం, విజయనగరం 31 శాతం, కృష్ణా 30 శాతం, అనంతపురం 23 శాతం, ప్రకాశం జిల్లాలో 21 శాతం అధిక వర్షపాతం కురిసింది.

ఇక ఉభయగోదావరి జిల్లాలు, కడప, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. చిత్తూరు జిల్లాలో మాత్రం 21 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని రికార్డులు చెబుతున్నాయి. వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేయడంతో మరోసారి ముఖం చూపించి చెరువులు నిండేలా కురిసి తమ ముఖాల్లో ఆనందం నింపుతాడని రైతులు ఆశిస్తున్నారు.

Next Story