రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ

by  |
రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి భూమిపూజ
X

దిశ, వెబ్ డెస్క్ :
తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ముహుర్తం ఖరారైంది. గురువారం మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితారెడ్డిలు సంయుక్తంగా భూమిపూజ చేయనున్నారు.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజవర్గం పరిశ్రమల హబ్‌గా మారబోతోంది. ఇప్పటికే షాబాద్‌ మండలం చందనవెళ్లిలో వెల్స్‌ఫన్‌ పరిశ్రమతో పాటు మరో మూడు కంపెనీలు ఏర్పాటు కాగా.. ఇప్పుడు రంగారెడ్డి-సంగారెడ్డి జిల్లా సరిహద్దుల్లో (శంకర్‌పల్లి మండలం కొండకల్‌ గ్రామంలో) రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. దీనికోసం 2017 అక్టోబరులో మేధా సర్వో డ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం (Mou) కుదుర్చుకుంది.

దానికోసం టీఎస్ఐఐసీ ఇప్పటికే 100 ఎకరాలను రైతుల నుంచి సేకరించింది. 2022 నాటికి పనులను పూర్తి చేసి ఉత్పత్తులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 2వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ రైల్వే కోచ్‌ పరిశ్రమలో రైల్‌ కోచ్‌లు, బోగీలు, వ్యాగన్లు తయారు కానున్నాయి. సుమారు రూ.800 కోట్లతో ఆ ఫ్యాక్టరీ నిర్మాణం కానుంది.



Next Story

Most Viewed