వెళ్తే వెళ్లండి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

by  |
వెళ్తే వెళ్లండి.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాజకీయాల్లో అగ్గి రాజుకుంటున్న సమయంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వదిలివెళ్లే వాళ్లు వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. దీంతో కొత్తవారికి అవకాశం కల్పించినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్ఎస్‌యూఐ నాయకులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేయడంతో సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు పార్టీని వీడుతున్న సచిన్ పైలట్‌ను.. కొంతమంది నాయకులు తిరిగి రావాలని మంతనాలు చేస్తుంటే.. రాహుల్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story

Most Viewed